రిస్క్‌కు సిద్ధమైన విక్రమ్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ విభిన్నమైన పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన 2019లో చివరగా ఓ చిత్రంలో నటించారు. విశ్వనటుడు కమల్‌హాసన్‌ నిర్మించిన ‘కడారమ్‌ కొండాన్‌’  ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చిత్రం కూడా రిలీజ్‌ కాలేదు. ఈ నేపథ్యంలో విక్రమ్‌ ప్రస్తుతం అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చియాన్‌ విక్రమ్‌ ఓ విభిన్నమైన ఆకారంలో కనిపించనున్నారనే విషయం ఆ చిత్రం టీజర్‌ను చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. జనవరిలో విడుదలైన ఈ టీజర్‌ను ఇప్పటివరకు 18 మిలియన్ల మంది వీక్షించారు. దీంతో ఈ చిత్రం కోసం చియాన్‌ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

కాగా విక్రమ్‌ పెద్ద రిస్క్‌ చేయాలని భావి స్తున్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో టైటిల్‌ ఖరారు చేయని ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘కోబ్రా’ కంటే ముందుగా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ఇదే ఆయన అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే... కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో హీరో ధనుష్‌ నటించిన ‘జగమే తంత్రమ్‌’ చిత్రం ఈనెల 18న ఓటీటీలో విడుదలకాగా, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఫ్లాప్‌ నుంచి ఆ చిత్ర యూనిట్‌ ఇంకా బయటపడలేదు. ఈ పరిస్థితుల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో విక్రమ్‌ సినిమా రిలీజ్‌ చేయడం ఎంతవరకు సబబని ఆయన అభిమా నులు ప్రశ్నిస్తున్నారు. ‘జగమే తంత్ర‌మ్‌’ ఫెయిల్యూర్‌కు దర్శకుడే కారణ మనే టాక్‌  కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అలాంటపుడు... విక్రమ్‌ ‘కోబ్రా’ చిత్రా న్ని రిలీజ్‌ చేసి ఆ తర్వాతే కార్తీక్‌ సుబ్బరాజ్‌ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.