Shah Rukh, Atlee సినిమా నయన్ కంటే ముందు Samantha వద్దకే వచ్చిందంట.. కానీ ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..

ABN , First Publish Date - 2021-10-19T23:33:10+05:30 IST

సమంత ఈ మధ్య అనేక కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. నాగ చైతన్యతో విడిపోవటంతో ఫ్యాన్స్‌తో పాటూ చాలా మంది డిజపాయింట్ అయ్యారు. అయితే, సామ్ పర్సనల్ లైఫ్ మాత్రమే కాదు రీసెంట్‌గా తన ప్రొఫెషనల్ లైఫ్‌కి కూడా నెగటివ్ ఎఫెక్ట్ తప్పటం లేదు.

Shah Rukh, Atlee సినిమా నయన్ కంటే ముందు Samantha వద్దకే వచ్చిందంట.. కానీ ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..

సమంత ఈ మధ్య అనేక కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. నాగ చైతన్యతో విడిపోవటంతో ఫ్యాన్స్‌తో పాటూ చాలా మంది డిజపాయింట్ అయ్యారు. అయితే, సామ్ పర్సనల్ లైఫ్ మాత్రమే కాదు రీసెంట్‌గా తన ప్రొఫెషనల్ లైఫ్‌కి కూడా నెగటివ్ ఎఫెక్ట్ తప్పటం లేదు. 


తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నేరుగా కింగ్ ఖాన్ షారుఖ్‌తోనే సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి సినిమాలో హీరోయిన్‌గా నయనతార ఎంపికైంది. షారుఖ్, అట్లీ సినిమానే నయన్‌కు తొలి హిందీ చిత్రం కానుంది. అయితే, తాజాగా సదరు ప్రాజెక్ట్‌పై ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి నయనతార కంటే ముందు సమంతనే అప్రోచ్ అయ్యాడట డైరెక్టర్ అట్లీ. బాలీవుడ్ బాద్షా సరసన నటించమని సామ్‌ని అడిగాడట. కానీ, అప్పట్లో ఆమె నాగ చైతన్యతో బంధాన్ని ఎలాగైనా కాపాడుకునే ప్రయత్నాల్లో ఉండటంతో మూవీని రిజెక్ట్ చేసిందట. సమంత తాను తల్లి కావాలని భావించటంతో అప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలో ఛాన్స్‌ను వద్దనుకుందట. కానీ, దురదృష్టవశాత్తూ చే, సామ్ విడిపోక తప్పలేదు. 


బాలీవుడ్‌లో తొలి చిత్రం, అదీ షారుఖ్ లాంటి సూపర్ స్టార్‌తో ఛాన్స్... అయినా సమంత వద్దనుకుందంటే, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్టే లెక్క. చూడాలి మరి, నెక్ట్స్ ఎలాంటి సినిమాతో, ఏ హీరోతో బీ-టౌన్ ఎంట్రి ఇస్తుందో...     

Updated Date - 2021-10-19T23:33:10+05:30 IST