మంచు విష్ణు.. ఈ రోజే ఎందుకు?

ABN , First Publish Date - 2021-10-13T23:14:44+05:30 IST

రీసెంట్‌గా జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన విషయం తెలిసిందే! వాస్తవానికి ముందు అనుకున్నట్లుగా అయితే.. ఈ నెల 16న గెలిచిన తన టీమ్‌తో కలిసి విష్ణు ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టాలి. కానీ ఈరోజు..

మంచు విష్ణు.. ఈ రోజే ఎందుకు?

రీసెంట్‌గా జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన విషయం తెలిసిందే! వాస్తవానికి ముందు అనుకున్నట్లుగా అయితే.. ఈ నెల 16న గెలిచిన తన టీమ్‌తో కలిసి విష్ణు ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టాలి. కానీ ఈరోజు ‘ముహూర్తం బాగుందని, తను చేసే పనులకు ఎంతో సహకరిస్తుందని..’ చెబుతూ ఎవరూ ఊహించని విధంగా బుధవారం ‘మా’ అధ్యక్ష పీఠాన్ని విష్ణు అధిరోహించారు. విష్ణు ఈరోజు అధికారం చేపడతారనే విషయం ఉదయం వరకు ఎన్నికల అధికారికిగానీ, తన ప్యానల్‌లో గెలిచిన సభ్యులకుగానీ తెలియకపోవడం విశేషం. అలాగే డీఆర్‌సీ పెద్దలు ఎవరూ లేకుండానే సింపుల్‌గా ఈ వ్యవహారం అంతా జరిగిపోవడం ఇప్పుడనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి ప్రకాశ్ రాజ్ అండ్ ప్యానల్ కోర్టును ఆశ్రయిస్తే.. మొదటికే మోసం వస్తుందని భావించిన విష్ణు అండ్ టీమ్ బహుశా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే విధంగా వార్తలు వినబడుతున్నాయి.


ఈ ఎన్నికలలో విష్ణు ప్రత్యర్థిగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో గెలిచిన వారు రాజీనామా చేస్తున్నట్లుగా మంగళవారం జరిగిన సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాజీనామాల తర్వాత వారంతా పోస్టల్ బ్యాలెట్‌లో అవకతవకలు జరిగాయని కోర్టును గనుక ఆశ్రయిస్తే.. ఈ ఎన్నికల ఫలితాలపై కోర్టు స్టే విధించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు మరియు అతని ప్యానల్‌లో గెలిచిన వారికి అధికారం చేజిక్కించుకునే విషయంలో జాప్యం జరిగే అవకాశంగానీ, మరేదైనా జరిగే అవకాశం ఉందని భావించే.. విష్ణు ఆలస్యం చేయకుండా ‘మా’ పీఠం ఎక్కి.. అధికారం చేపట్టినట్లుగా టాక్. పదవిని స్వీకరించిన తర్వాత ఎవరేం చేసినా.. పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు కాబట్టే ఈ రోజు విష్ణు ‘మా’ పగ్గాలకు సంబంధించిన తతంగాన్ని పూర్తి చేశాడనేలా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 



Updated Date - 2021-10-13T23:14:44+05:30 IST