మలయాళంలో ఎందుకు చిరూ...?

ABN , First Publish Date - 2022-09-26T06:37:11+05:30 IST

ఇప్పుడంతా పాన్‌ ఇండియా హంగామానే. పెద్ద సినిమా వస్తోందంటే అన్ని భాషల్లోనూ విడుదల చేయాలని చూస్తున్నారు....

మలయాళంలో ఎందుకు చిరూ...?

ఇప్పుడంతా పాన్‌ ఇండియా హంగామానే. పెద్ద సినిమా వస్తోందంటే అన్ని భాషల్లోనూ విడుదల చేయాలని చూస్తున్నారు. కొన్ని చిత్రాలకు ఇది కలిసి వస్తోంది కూడా. చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ని సైతం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు.. మలయాళంలోనూ ఈ చిత్రాన్ని అక్టోబరు 5న రిలీజ్‌ చేస్తున్నారు. మామూలుగా అయితే.. మలయాళంలో చిరు చిత్రం వెళ్లడం పెద్ద వింతేం కాదు. కానీ ఈసారైంది. ఎందుకంటే.. ‘గాడ్‌ ఫాదర్‌’ కథ.. మలయాళ సూపర్‌ హిట్‌ ‘లూసీఫర్‌’ నుంచి తీసుకొన్నదే. ‘లూసీఫర్‌’కి అఫీషియల్‌ రీమేక్‌ ఇది. మలయాళ సినిమాని రీమేక్‌ చేస్తూ, మలయాళంలో ఎందుకు విడుదల చేస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చిరుకి మలయాళంలో అంత మార్కెట్‌ ఏర్పడలేదు. పైగా ఇది రీమేక్‌ సినిమా అని అందరికీ తెలుసు. అయినా... మల్లూవుడ్‌లోకి ‘గాడ్‌ ఫాదర్‌’ని దించేస్తున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్‌ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాని మలయాళంలో విడుదల చేయడం అవసరమా? అని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఏమవుతుందో చూడాలి. 


Updated Date - 2022-09-26T06:37:11+05:30 IST