దంగల్ సినిమాలో Aamir Khan కి ముందు హీరో ఎవరో తెలుసా..?

ఆమిర్ ఖాన్ నటించిన ‘‘ దంగల్’’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. బాలీవుడ్‌లో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. చైనాలో అయితే అత్యధిక వసూళ్లను సాధించిన విదేశీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా 2016లో క్రిస్ మస్ సందర్భంగా విడుదలైంది. ఈ మూమీకి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. మహవీర్ సింగ్ ఫోగట్ అనే రెజ్లర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆయన పాత్రను ఆమిర్ ఖాన్ పోషించారు. మొదట దర్శక, నిర్మాతలు ఈ పాత్రకు వేరొకరిని అనుకున్నారు.

యూటీవీ క్రియేటివ్ హెడ్ మనీశ్ హరిప్రసాద్, నితీశ్ తివారీ  మీడియాతో మాట్లాడుతూ.. ఏ పాత్రనయినా పోషించే నటుణ్ని ఈ పాత్రకు ఎంపిక చేయాలనుకున్నాం. అందువల్ల ఇర్ఫాన్ ఖాన్ అయితే సరిపోతారనుకున్నాం. కానీ, ఒకసారి స్క్రిఫ్ట్ రెడీ అయిన అనంతరం ఆమీర్ ఖాన్ నే సంప్రదించామన్నారు. ఆ సినిమాకు ఆమీర్ ఖాన్ అంగీకారం తెలపగానే మేం నమ్మలేకపోయామని వివరించారు.

ఆమిర్ ఖాన్ తన రోల్ కు సంబంధించి కొన్ని ఇన్‌పుట్స్ కూడా ఇచ్చారని మనీశ్ హరిప్రసాద్ తెలిపారు. వృద్ధుడైన ఫోగట్‌గా కనిపించడం కోసం దాదాపు 25కేజీల బరువు పెరుగుతానని ఆమిర్ చెప్పారని వివరించారు. ఆయన ఎటువంటి మేకప్ లేకుండానే 50 నుంచి 55ఏళ్ల వ్యక్తిగా కనిపించారన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Alia Bhatt: ఒకటి కాదు రెండు కాదు.. RRR హీరోయిన్ నుంచి ఏకంగా మూడు తీపికబుర్లు..!

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.