సమయం వచ్చినప్పుడు అన్ని బయటికొస్తాయి: మారుతి

ABN , First Publish Date - 2022-01-22T23:31:43+05:30 IST

సమయం వచ్చినప్పుడు అన్ని బయటికొస్తాయి అని అన్నారు దర్శకుడు మారుతి. గత రెండు మూడు రోజుల నుంచి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

సమయం వచ్చినప్పుడు అన్ని బయటికొస్తాయి: మారుతి

సమయం వచ్చినప్పుడు అన్ని బయటికొస్తాయి అని అన్నారు దర్శకుడు మారుతి. గత రెండు మూడు రోజుల నుంచి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని..దీని కథ నేపథ్యం, సంగీత దర్శకుడు..హీరోయిన్ సహా ఇతర టెక్నీషియన్ వీరే.. అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో తాజాగా మారుతి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ మేరకు ఆయన.. "నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. నాకు సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం మారుతి గోపీచంద్, రాశిఖన్నా జంటగా 'పక్కా కమర్షియల్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  



Updated Date - 2022-01-22T23:31:43+05:30 IST