Gauri Khan అన్నయ్య తుపాకీ పట్టుకుని Shah Rukh Khan దగ్గరకు వెళ్లి ఏం చేశాడంటే..!

ABN , First Publish Date - 2021-10-26T17:41:56+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

Gauri Khan అన్నయ్య తుపాకీ పట్టుకుని Shah Rukh Khan దగ్గరకు వెళ్లి ఏం చేశాడంటే..!

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. షారూక్, గౌరి ప్రేమ, పెళ్లి సమయంలో జరిగిన సంఘటనలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. వేర్వేరు మతాలకు చెందిన షారూక్, గౌరి ఆరేళ్లు ప్రేమించుకుని 1991లో వివాహం చేసుకున్నారు. ఆ వివాహ సమయంలో జరిగిన సంఘటనలను షారూక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. గౌరి సోదరుడు తుపాకీ తీసుకొచ్చి చంపేస్తానని తనను బెదిరించినట్టు తెలిపాడు. 


సినీ నటుడిగా షారూక్ కెరీర్ ఎలా ఉంటుందో అనే భయంతో గౌరి తండ్రి రమేష్, తల్లి సవిత పెళ్లికి అడ్డుచెప్పారట. ఆ సమయంలో గౌరి సోదరుడు విక్రాంత్ తుపాకీ తీసుకెళ్లి షారూక్‌ను బెదిరించాడట. అప్పటికే విక్రాంత్‌ గుండాగా ప్రసిద్ధి చెందాడు. అయినా షారూక్ బెదరలేదట. `వివాహ సమయానికి నేను చాలా పేదవాడిని. గౌరి మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ సమయంలో నేను గౌరికి మాయ మాటలు చెప్పాను. `వివాహం తర్వాత మనం హనీమూన్‌కు పారిస్ వెళ్దాం. అక్కడ నీకు ఈఫిల్ టవర్ చూపిస్తాన`ని చెప్పాను. అయితే పెళ్లి తర్వాత పారిస్ తీసుకెళ్లలేకపోయినా.. డార్జిలింగ్ తీసుకెళ్లాను. నిజానికి గౌరి అప్పటికి చాలా అమాయకురాలు` అని షారూక్ చెప్పాడు. 

Updated Date - 2021-10-26T17:41:56+05:30 IST