టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ అనౌన్స్ చేసిన సీక్వెల్స్ ఎప్పుడు రానున్నాయి అంటూ అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారట. ఆయన ప్రస్తుతం 'మేజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కరోనా కారణంగా మూత పడ్డ థియేటర్స్ ఓపెన్ అవగానే 'మేజర్' మూవీని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారట. ఇక ఇప్పటికే రెండు సీక్వెల్స్‌ను అడివి శేష్ అనౌన్స్ చేశాడు. ఆ సీక్వెల్స్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. 'గూడఛారి', 'హిట్' సినిమాల సీక్వెల్లో ఆయన నటించాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ సద్దుమణగడంతో ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్‌ని మొదలు పెట్టారు. మరి అడివి శేష్ తన కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడు పట్టాలెక్కించనున్నాడో చూడాలి.