ఏ నిమిషానికి ఏమి జరుగునో..?!

ABN , First Publish Date - 2021-11-30T06:53:27+05:30 IST

‘జీవితంలో ప్లానింగ్‌ చాలా అవసరం’ అని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే. ముందస్తు ప్రణాళికలు లేకపోతే, బతుకు బాటలో ముందుకు సాగలేం. కాకపోతే... ‘ఎక్కడైనా ప్లానింగ్‌ వర్కవుట్‌ అవుతుందేమో గానీ...

ఏ నిమిషానికి ఏమి జరుగునో..?!

‘జీవితంలో ప్లానింగ్‌ చాలా అవసరం’ అని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే. ముందస్తు ప్రణాళికలు లేకపోతే, బతుకు బాటలో ముందుకు సాగలేం. కాకపోతే... ‘ఎక్కడైనా ప్లానింగ్‌ వర్కవుట్‌ అవుతుందేమో గానీ, సినిమా పరిశ్రమలో మాత్రం అది కుదరదు...’ అంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. టాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతమైన కథానాయికగా రకుల్‌ పేరు తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. మీ ఎదుగుదలకు కారణం ప్లానింగేనా? అని అడిగితే.. ‘‘గెలవడానికి ఎవరికైనా ప్రణాళికలు అత్యవసరం. కానీ.. చిత్రసీమలో ప్లానింగ్‌ తో పనులు జరగవు. మనం ఒకటి అనుకుంటే, మరోటి జరుగుతుంటుంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్క రోజులో జాతకం మారిపోతుంది. ఇక్కడ సర్‌ప్రైజ్‌లు ఎక్కువ. అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతుంటాయి. కాబట్టి.. ఏదేదో ఊహించుకోవడం, దానికి తగ్గట్టుగా పనిచేయడం కుదరని పని. నిజానికి మన ఊహకు అందని ఫలితాలు రావడం కూడా ఒక్కోసారి థ్రిల్‌ కలిగిస్తుంటుంది’’ అని చెప్పుకొచ్చింది.


Updated Date - 2021-11-30T06:53:27+05:30 IST