Aryan Khanకు ష్యూరిటీ ఇచ్చేందుకు వెళ్లిన Juhi Chawla ను జడ్జి అడిగిన ప్రశ్న ఇది.. అక్కడేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-10-30T21:44:48+05:30 IST
దాదాపు 27 రోజులు జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు ఈ రోజు (శనివారం) ఇంటికి వెళ్లాడు.

దాదాపు 27 రోజుల జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు ఈ రోజు (శనివారం) ఇంటికి వెళ్లాడు. గురువారం ముంబై హై కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆర్థర్ రోడ్డు జైలు అధికారులు ఈ రోజు ఆర్యన్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లా పూచీకత్తుపై ఆర్యన్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. ఆర్యన్ ఖాన్‌కు ష్యూరిటీ ఇచ్చేందుకు జుహీ చావ్లా సెషన్స్ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తన పాస్‌పోర్ట్ సైజు ఫొటోను ఒకటి మాత్రమే తీసుకెళ్లింది. బెయిల్ ఫార్మ్‌పై అంటించేందుకు మరొకటి కావాలని కోర్టు సిబ్బంది అడిగారు. దీంతో ఆమె తన ఇంటి నుంచి హుటాహుటిన మరో ఫొటో తెప్పించింది.
ఆనంతరం ఆమెను ఆర్యన్ తరఫు న్యాయవాది సతీష్ మానషిండే.. జడ్జి వీవీ పాటిల్‌కు పరిచయం చేశారు. `మీరు ఎవరి బెయిల్‌కు ష్యూరిటీ ఇస్తున్నారో.. అతని గురించి మీకు తెలుసా?` అని జుహీని పాటిల్ అడిగారు. ఆ ప్రశ్నకు జుహీ స్పందిస్తూ.. `అతడి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అతడి తండ్రి వ్యాపారంలో నేను భాగస్వామిని` అని చెప్పింది. అనంతరం జుహీ చావ్లా తన పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు కాపీలను కోర్టులో సమర్పించింది. జడ్జి వాటన్నింటినీ పరిశీలించి ఆర్యన్ బెయిల్ ఆర్డర్‌పై సంతకం చేశారు.