ఈ వర్మకు ఏమైంది?

ABN , First Publish Date - 2021-08-21T06:26:55+05:30 IST

ఈ వర్మకు ఏమైంది? ఇదేంటి ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా టైటిల్‌లా ఉంది అనుకుంటున్నారా? వర్మ చేసే పనులకి ఏ సినిమా టైటిలూ సరిపోదంటే సరిపోదంతే. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఆయన ప్రవర్తనే.. ఎప్పుడూ హాట్ హాట్‌గా చర్చలకు తావిస్తుంది. శ్రీదేవిని ప్రేమించానంటాడు? పెళ్లి..

ఈ వర్మకు ఏమైంది?

ఈ వర్మకు ఏమైంది? ఇదేంటి ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా టైటిల్‌లా ఉంది అనుకుంటున్నారా? వర్మ చేసే పనులకి ఏ సినిమా టైటిలూ సరిపోదంటే సరిపోదంతే. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఆయన ప్రవర్తనే.. ఎప్పుడూ హాట్ హాట్‌గా చర్చలకు తావిస్తుంది. శ్రీదేవిని ప్రేమించానంటాడు? పెళ్లి చేసుకోవాలని అనుకున్నానంటాడు. అది కుదరలేదని ఇప్పుడు ప్రతి అమ్మాయిలో శ్రీదేవినే చూస్తున్నానంటాడు. ఇదంతా బాగానే ఉంది కానీ.. తన కూతురు వయసున్న వారితో ఆయన చేసే చేష్టలు చూస్తుంటేనే.. జనాలకు ఆయనపై అసహ్యమేస్తోంది. మొన్న అరియానా? నిన్న అషురెడ్డి.. ఇవాళ మరో అమ్మాయి. అంతకుముందేం తక్కువ కాదు. ‘క్రాక్’ సినిమాలో ఐటంసాంగ్ చేసిన అప్సరా రాణి, మియా మాల్కోవా, శ్రీ రాపాక, నైనా గంగూలీ.. ఇలా ఒక్కరేమిటి? రోజుకో అమ్మాయ్ అన్నట్లుగా వర్మ దారుంది. ఆయన చేసే చేష్టలతో, తీసే సినిమాలతో ఆయనని జనం రామ్ గోపాల్ వర్మ అని అనడం కూడా మానేశారు. ‘బూతు వర్మ’, ‘వివాదాల వర్మ’ అని ముద్దుముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ బూతు వర్మ మళ్లీ రామ్ గోపాల్ వర్మ అయ్యేది ఎప్పుడో? ఈ కరోనా వైరస్ పోయేది ఎప్పుడో? కాలమే నిర్ణయించాలి. 


ఇక తాజాగా వర్మ పోస్ట్ చేసిన ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్ బుక్ అకౌంట్‌లోని వీడియో విషయానికి వస్తే.. ఫుల్‌గా డ్రింక్ చేసిన వర్మ బర్త్‌డే జరుపుకుంటున్న అమ్మాయిపై ఎక్కడెక్కడ చేతులేస్తున్నాడో కూడా తెలియనంతగా ప్రవర్తిస్తున్నాడు. వర్మకు తెలియదు అనుకుంటే పొరబాటే. తెలిసే వేస్తున్నాడు. అందం గురించి పాఠాలు చెప్పే వర్మకు, అసలందం అంటే ఏంటో టాక్స్ కట్టించుకుని మరీ GSTలో చూపించిన వర్మకు ఇవన్నీ తెలియకుండానే చేస్తున్నాడని ఎలా అనుకుంటాం? పక్కన జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు క్లాప్స్ కొట్టి మరీ ఎంకరేజ్ చేస్తుంటే.. వర్మ అసలు ఊరుకుంటాడా? ఆయన బతికేదే అందుకు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా.. దానిలో వేలెట్టి కెలికే రకానికి ఎవరైనా ఏమెట్టి చెప్పగలరు?. ఇంకా భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలియదు.. ఎంజాయ్ చేస్తున్నాడు చేయనివ్వండి అని అనేవాళ్లు కూడా ఉన్నారిక్కడ. అయితే ఆయనని ఎంజాయ్ చేయవద్దని ఇక్కడెవరూ చెప్పడం లేదు. ఆ చేసేది బయటికి ఎందుకు చూపించడం? తనంత మగాడు లేడని జనం అనుకోవాలా? లేక జనాల్ని నేర్చుకోమని చూపిస్తున్నాడా?. ఒకప్పుడు క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు.. వద్దులే బాగోదు.. రాస్తే న్యూస్‌లను కూడా సెన్సార్ చేయాలనే చట్టాలు పెడతారు. ఫైనల్‌గా ఆల్కహాల్ ఎంత హానికరమో.. ఈ వర్మ కూడా అంతే హానికరం అనే బోర్డులు సినిమా ఇండస్ట్రీలలో, సోషల్ మీడియాలలో వెలిసే రోజులు వచ్చినా రావచ్చు. ఏమో చెప్పలేం.  



Updated Date - 2021-08-21T06:26:55+05:30 IST