తీహార్‌ కాలేజ్‌కి స్వాగతం

ABN , First Publish Date - 2022-09-29T05:37:06+05:30 IST

ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ వ్యంగ్యం, వినోదం కలబోతగా రూపొందుతున్న చిత్రం ‘వెల్కమ్‌ టు తీహార్‌ కాలేజ్‌’...

తీహార్‌ కాలేజ్‌కి స్వాగతం

ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ వ్యంగ్యం, వినోదం కలబోతగా రూపొందుతున్న చిత్రం ‘వెల్కమ్‌ టు తీహార్‌ కాలేజ్‌’. చక్రి, మనీషా జంటగా నటిస్తున్నారు. పి. సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్‌ ఎల్‌. ఎన్‌ రావు, యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్నారు. అక్టోబరు 28న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియోను ఇటీవలె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ ‘నేటి యువతరానికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. మన విద్యావ్యవస్థ మరింత మెరుగవ్వాల్సిన అవసరాన్ని ఈ చిత్రం నొక్కి చెపుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ ఇమ్మడి సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: సాబు జేమ్స్‌

Updated Date - 2022-09-29T05:37:06+05:30 IST