ప్రసన్న - ఎస్పీబీ చరణ్‌ కాంబినేషన్‌లో వెబ్‌సిరీస్‌

ABN , First Publish Date - 2022-01-20T00:49:28+05:30 IST

అర్బన్‌ కామెడీ డ్రామా జానర్‌లో ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది. ఇందులో ప్రసన్న, ఎస్పీబీ చరణ్‌, ధాన్య బాలకృష్ణ, కనిహా, సురేష్‌ చక్రవర్తి తదితరులు నటించనున్నారు. తమిళంలో రూపుదిద్దుకునే ఈ వెబ్‌సిరీస్‌ను ట్రెండ్‌ లౌడ్‌

ప్రసన్న - ఎస్పీబీ చరణ్‌ కాంబినేషన్‌లో వెబ్‌సిరీస్‌

అర్బన్‌ కామెడీ డ్రామా జానర్‌లో ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది. ఇందులో ప్రసన్న, ఎస్పీబీ చరణ్‌, ధాన్య బాలకృష్ణ, కనిహా, సురేష్‌ చక్రవర్తి తదితరులు నటించనున్నారు. తమిళంలో రూపుదిద్దుకునే ఈ వెబ్‌సిరీస్‌ను ట్రెండ్‌ లౌడ్‌ ఇండియా డిజిటల్‌, నిర్మాత బాలాజీ మోహన్‌కు చెందిన ఓపెన్‌ విండో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విఘ్నేష్‌ విజయ కుమార్‌ కథ సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ప్రముఖ దర్శకుడు బాలాజీ మోహన్‌ వద్ద అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. చెన్నై సహా దాని చట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే నెలాఖరులోగా షూటింగ్‌ పూర్తి చేయనున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Updated Date - 2022-01-20T00:49:28+05:30 IST