‘ప్రాజెక్ట్‌ కె’పై ప్రాణాలు పెట్టేస్తున్నాం

ABN , First Publish Date - 2022-05-18T05:55:35+05:30 IST

ప్రభాస్‌ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ‘ఆది పురుష్‌’, ‘సలార్‌’, ‘స్పిరిట్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’, మారుతి సినిమా...

‘ప్రాజెక్ట్‌ కె’పై ప్రాణాలు పెట్టేస్తున్నాం

ప్రభాస్‌ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ‘ఆది పురుష్‌’, ‘సలార్‌’, ‘స్పిరిట్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’, మారుతి సినిమా.. ఇలా బిజీ బిజీగా ఉన్నారు. అయితే... ఏ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ సరిగా రావడం లేదన్నది ప్రభాస్‌ అభిమానుల అభియోగం. అందుకనేమో ఇప్పుడు.. ‘ప్రాజెక్ట్‌ కె’ అప్‌డేట్‌ తో వచ్చారు దర్శకుడు నాగ అశ్విన్‌. ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకొంటూ.. ‘‘ఇటీవలే ఓ షెడ్యూల్‌ పూర్తి చేశాం. ప్రభాస్‌ పరిచయ సన్నివేశాల్ని తెరకెక్కించాం. జూన్‌లో తదుపరి షెడ్యూల్‌ మొదలవుతుంది. ఈ సినిమా కోసం టీమ్‌ అంతా ప్రాణాలు పెట్టి పనిచేస్తున్నాం. ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ లిస్టులో మన సినిమా చివర్లో ఉంది. అందుకే.. అప్‌ డేట్స్‌ రావడానికి సమయం పడుతోంది’’ అని క్లారిటీ ఇచ్చారు. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-05-18T05:55:35+05:30 IST