మనమంతా ఒకే తల్లి బిడ్డలం: మోహన్ బాబు

ABN , First Publish Date - 2021-10-16T18:45:35+05:30 IST

మనమంతా ఒకే తల్లి బిడ్డలం అని మంచు మోహన్ బాబు అన్నారు. నేడు ఆయన తనయుడు మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. " 'మా' లో రాజకీయాలు ఉండొద్దు

మనమంతా ఒకే తల్లి బిడ్డలం: మోహన్ బాబు

మనమంతా ఒకే తల్లి బిడ్డలం అని మంచు మోహన్ బాబు అన్నారు. నేడు ఆయన తనయుడు మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. " 'మా' లో రాజకీయాలు ఉండొద్దు..గురువు గారి దాసరి గారు మనసు ఎంతో బాధ పడుతూ ఉంటుంది. 47 సంవత్సరాలు నా జీవితం తెరిచిన పుస్తకం. మా ఎన్నికలు ఇలా జరుగుతాయని అనుకోలేదు. సినిమాల్లో జయాపజయాలు దైవాధీనం. టాలెంట్ ఉంటేనే సినిమా రంగంలో రాణించగలరు. మేమంతమంది ఉన్నాం అని బెదిరించారు. ఆ బెదిరింపులకు 'మా' కళాకారులు భయపలేదు. ఎవరికి భయపడకుండా మా ఓటు మసొంతం అని నా కొడుకుని గెలిపించారు. సినిమాలో దయదక్షిణ్యాలు ఉండవు.. కేవలం టాలెంట్ మాత్రమే ఉంటుంది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాకు పగ రాగద్వేషాలు లేవు.. వయసు పైబడుతుంది...నా ఆవేశం నాకే చేటు చేసింది. ఇతరులకు కాదు..ఇంతమంది నా బిడ్డను ఆశీర్వదించినపుడు ఆ దేవుళ్లు ఎందుకు.. ఆ గుడులు ఎందుకు. మీరే దేవుళ్లు. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను..భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఖ్యాతి తీసుకురావాలి 'మా' అసోసియేషన్‌కు. ప్రమాణ స్వీకారం అయ్యాక సమయం చూసుకుని సీఎం ను కలవాలి.సీఎం మాట ఇస్తే తప్పేమనిషి కాదు. సీఎం ను నేనే వెళ్లి కలుస్తా..విష్ణుకు సీనియర్ హీరోలు ఓటు వేయడానికి రాలేదు. అయిన మా మీదే.. అందరిది..రెండు సంవత్సరాలు అయిన నెల అయిన 'మా' అధ్యక్షుడు చిన్న ఉద్యోగం కాదు. సమస్యలు ఉంటే ప్రెసిడెంట్‌కు చెప్పండి. ఇంతకుముందు లాగా రోడ్లకు, టీవీ లకు ఎక్కోద్దు. చిత్రపురి కాలనీని హెరిటేజ్ గా మార్చేద్దామ్ అని సీఎం భావిస్తే, పేద కళాకారులకు ఇచ్చిన చిత్రపురి కాలనీ స్థలాలు అన్యాక్రాంతం అయ్యే సందర్భంలో నేను గవర్నర్‌కు లేఖ రాశాను. కలిసిమెలిసి ఉందాం.. కలిసి గట్టుగా సాధిద్దాం. మంచు గెలుపులో నరేష్ కీలకం. నాతో అంత పరిచయం లేకపోయినా నా బిడ్డ గెలుపు కోసం శ్రమించాడు.ఇకనైనా టీవీలకు ఎక్కకండి. మనుషుల్ని రెచ్చగొట్టకండి"..అని అన్నారు. 

Updated Date - 2021-10-16T18:45:35+05:30 IST