చెంపదెబ్బ మాత్రమే కనిపించిందా?

ABN , First Publish Date - 2021-11-07T06:39:15+05:30 IST

ఇటీవల విడుదలైన ‘జై భీమ్‌’ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. అయితే.. ఓ సన్నివేశం దగ్గరే చిక్కొచ్చి పడింది. హిందీ మాట్లాడుతున్న వ్యక్తిని ప్రకాష్‌రాజ్‌ చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఇప్పుడు...

చెంపదెబ్బ మాత్రమే కనిపించిందా?

ఇటీవల విడుదలైన ‘జై భీమ్‌’ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. అయితే.. ఓ సన్నివేశం దగ్గరే చిక్కొచ్చి పడింది. హిందీ మాట్లాడుతున్న వ్యక్తిని ప్రకాష్‌రాజ్‌ చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఇప్పుడు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ‘ఇది హిందీ భాషని అవమానించడమే’ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై ప్రకాష్‌ రాజ్‌ స్పందించారు. ‘‘ఈ సినిమాలో అణగారిన వర్గాల బాధని చెప్పాం. వాళ్ల కష్టాల్ని చూపించాం. కానీ కొంతమంది ఈ సినిమాలోని చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నేనున్నాననే కావాలని ఈ సినిమాని వివాదంలో లాగారు. ఇటువంటి వివాదాలకు స్పందించడంలో ఎలాంటి అర్థం లేద’’న్నారు.

Updated Date - 2021-11-07T06:39:15+05:30 IST