ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చారు

ABN , First Publish Date - 2021-09-07T06:44:40+05:30 IST

హిందీ నటి సైరా బాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బావుందనీ, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సన్నిహితులు ఫైజల్‌ ఫరూఖి తెలిపారు...

ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చారు

హిందీ నటి సైరా బాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బావుందనీ, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సన్నిహితులు ఫైజల్‌ ఫరూఖి తెలిపారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో పాటు హైబీపీ, సుగర్‌తో గత వారం ముంబైలోని హిందూజ ఆస్పత్రిలో ఆమె చేరారు. ఆ తర్వాత హృద్రోగ సమస్యను గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కోలుకుని డిశ్చార్జి కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. సైరా బాను భర్త, ఒకప్పటి హిందీ హీరో దిలీప్‌ కుమార్‌ ఈ ఏడాది జూలై 7న మరణించిన సంగతి తెలిసిందే.


Updated Date - 2021-09-07T06:44:40+05:30 IST