వారియర్‌ రామ్‌

ABN , First Publish Date - 2022-01-18T05:39:30+05:30 IST

రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రానికి ‘ది వారియర్‌’ అనే టైటిల్‌ను మేకర్స్‌ నిర్ణయించారు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న...

వారియర్‌ రామ్‌

రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రానికి ‘ది వారియర్‌’ అనే టైటిల్‌ను మేకర్స్‌ నిర్ణయించారు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. సోమవారం టైటిల్‌ను ప్రకటించి రామ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోలీస్‌ లుక్‌లో రామ్‌ పవర్‌ఫుల్‌గా కనిపించారు. కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. హీరోగా రామ్‌కి ఇది 19వ చిత్రం. తొలి తమిళ స్ట్రెయిట్‌ చిత్రం. ‘గత చిత్రాలను మించిన స్థాయిలో లింగుస్వామి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలె కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది’ అని శ్రీనివాసా చిట్టూరి చెప్పారు.


Updated Date - 2022-01-18T05:39:30+05:30 IST