అనవసర విషయాలలో జోక్యం వద్దు.. సూర్యకు వార్నింగ్

హీరో సూర్యకు తమిళనాడు రాష్ట్ర బిజెపి యువజన కార్యవర్గం వార్నింగ్‌ ఇచ్చింది. సూర్య సినిమాలలో నటించేదానిపై దృష్టి పెడితే మంచిదని, అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయనేలా వారు హెచ్చరికలు జారీ చేశారు. సూర్యతో పాటు కోలీవుడ్‌కు సంబంధించిన పలువురు సెలబ్రిటీలు నూతన సినిమాటోగ్రఫీ చట్టం విషయంలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యతిరేకిస్తున్న వారందరిపై తమిళనాడు బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై తమిళనాడు రాష్ట్ర బిజెపి యువజన కార్యవర్గం ఓ సమావేశాన్ని నిర్వహించింది. కార్యదర్శి వినోద్ సెల్వం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యకర్తలందరూ సూర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య తన సినిమాల సంగతి చూసుకుంటే మంచిదని, పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తమిళనాడు రాష్ట్ర బిజెపి యువజన కార్యవర్గం హెచ్చరించింది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.