నిర్మాతగా మారుతోన్న దర్శకుడికి.. VV Vinayak సపోర్ట్

Twitter IconWatsapp IconFacebook Icon
నిర్మాతగా మారుతోన్న దర్శకుడికి.. VV Vinayak సపోర్ట్

దర్శకత్వశాఖలో అనుభవం కలిగి.. ‘ప్రేమంటే సులువు కాదురా’ (Premante Suluvukadura) చిత్రంతో దర్శకుడిగా పరిచయమై.. తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి గుర్తింపును పొందిన చందా గోవింద రెడ్డి (Chanda Govind Reddy).. ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. తన ఇష్టదైవమైన ‘శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి’ పేరిట ‘శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్’ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. ఆ బ్యానర్‌లో స్వీయ దర్శకత్వంలో ఆయనిప్పుడు ఓ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ బ్యానర్‌ లోగోను తాజాగా సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ (VV Vinayak) ఆవిష్కరించి.. తన చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకున్న ఈ ‘శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్’ అంచెలంచెలుగా ఎదిగి.. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చోటు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో సీనియర్ దర్శకుడు కె.సాగర్ (K Sagar).. దర్శకనిర్మాత చందా గోవిందరెడ్డికి శుభాశీస్సులు అందించారు. అనంతరం చందా గోవిందరెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ దర్శకులు సాగర్ సమక్షంలో, సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్‌గారు  మా ‘శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్’ (Sri Ishta Kameswara Creations) లోగో లాంచ్ చేయడం చాలా గర్వంగానూ, సంతోషంగానూ ఉందని అన్నారు. తమ బ్యానర్‌లో రూపొందే చిత్ర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ‘రఫ్’ చిత్ర దర్శకుడు సుబ్బారెడ్డి, సీనియర్ కో-డైరెక్టర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.