Vivek Oberoi : ప్రతిభతో పనిలేదు.. ట్యాగ్‌ ఉంటే చాలు!

ABN , First Publish Date - 2021-12-06T23:25:01+05:30 IST

బాలీవుడ్‌లో టాలెంట్‌ కంటే ఇంటి పేర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వివేక్‌ ఒబెరాయ్‌ అన్నారు. తాజాగా ఆయన నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ 3వ సీజన్‌ విడుదలైంది. దీని ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బాలీవుడ్‌ తీరు గురించి మాట్లాడారు.

Vivek Oberoi : ప్రతిభతో పనిలేదు.. ట్యాగ్‌ ఉంటే చాలు!

బాలీవుడ్‌లో టాలెంట్‌ కంటే ఇంటి పేర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వివేక్‌ ఒబెరాయ్‌ అన్నారు. తాజాగా ఆయన నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ 3వ సీజన్‌ విడుదలైంది. దీని ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బాలీవుడ్‌ తీరు గురించి మాట్లాడారు. ‘‘సినిమా పరిశ్రమ యంగ్‌ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసే వ్యవస్థను అభివృద్థి చేసుకోలేకపోయింది. బీటౌన్‌ను ఒక ఎక్స్‌క్లూజివ్‌ క్లబ్‌గా మార్చేశారు. అందులోకి రావాలంటే ఇంటిపేరు  గొప్పదై ఉండాలి లేదా ప్రముఖుల బ్యాగ్రౌండ్‌ అయినా ఉండాలి. తెలిసిన ఎవరో ఒకరి గ్రూప్‌లో చేరాలి. అలాంటి వారికి మాత్రమే బాలీవుడ్‌లో ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ప్రతిభతో ఇక్కడ అవసరం లేదు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమలో ఉన్న నాలాంటి వారికే ఇక్కడ చాలా కష్టంగా ఉంది. నా వరకూ వీలైనంతగా కొత్తవారిని ప్రోత్సహిస్తున్నాను’’ అని అన్నారు. 


Updated Date - 2021-12-06T23:25:01+05:30 IST