రెండు రోజుల్లో పిల్లని వెతికిపెట్టండి : విశ్వక్‌సేన్

‘ఈ నగారానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్, పాగల్, హిట్’ లాంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు విశ్వక్‌సేన్. తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో సరికొత్తగా వెళ్ళే అతడు.. తాజాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం కోసం మరింత కొత్త ఆలోచనతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ చిన్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు విశ్వక్. 


చింత మ్యారేజ్ బ్యూరో అప్లికేషన్ ఫామ్ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అప్లికేషన్ ఫామ్ పై ఉన్న ఫోటోలోంచి విశ్వక్ సేన్ బైటికి తొంగిచూస్తూ.. ‘ఇంకా రెండు రోజులే ఉంది. పిల్లని వెతికి పెట్టండి, లేదా కనీసం పడేయడానికి టిప్స్ అయినా ఇవ్వండి’... అంటూ అభ్యర్ధించడం ఆకట్టుకుంటోంది. వడ్డీ వ్యాపారి అర్జున్ గా విశ్వక్ నటిస్తున్నాడు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బి.వీ.యస్.యన్ ప్రసాద్ సమర్పణలో ఆయన తనయుడు  బాపినీడు.. సుధీర్ ఈదరతో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.