విశాల్ ‘సామాన్యుడు’కి విడుదల తేదీ ఖరారు

ABN , First Publish Date - 2022-01-30T00:54:55+05:30 IST

తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ యాక్షన్ డ్రామాకు ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది ట్యాగ్‌లైన్‌. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని

విశాల్ ‘సామాన్యుడు’కి విడుదల తేదీ ఖరారు

యాక్షన్ హీరో విశాల్ ‘సామాన్యుడు’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీని మార్చుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ యాక్షన్ డ్రామాకు ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది ట్యాగ్‌లైన్‌. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, సాంగ్, టీజర్లకు మంచి స్పందన రావ‌డంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. విశాల్ సరసన డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Updated Date - 2022-01-30T00:54:55+05:30 IST