అర్జున్ సినిమాలో కీలక పాత్రలో విశాల్ తండ్రి

జీఎస్‌ ఆర్ట్స్‌ పతాకంపై జి. అరుళ్‌కుమార్‌ సమర్పణలో దినేష్‌ లక్ష్మణన్‌ దర్శకత్వంలో ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ‘ప్రొడక్షన్‌ నంబరు-2’ చిత్రంలో స్టార్‌ హీరో విశాల్‌ తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ఓ కీలక పాత్రను పోషించనున్నారు. అలాగే, నటుడు కదిర్‌ తండ్రి లోగు కూడా ఈ చిత్ర బృందంలో వచ్చి చేరారు. ఇందులో యాక్షన్‌కింగ్‌ అర్జున్‌, ఐశ్వర్యా రాజేష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో హీరో తండ్రి పాత్రలో జీకే రెడ్డి కనిపించనున్నారు.


క్రైమ్‌ థ్రిల్లర్‌, ఇన్వెస్టిగేషన్‌ బాణీలో కొనసాగినప్పటికీ కుటుంబ బంధాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా తెరకెక్కిస్తున్నారు. అలాగే మరో నటుడు కదిర్‌ తండ్రి లోగు పాత్ర కూడా ఈ చిత్రానికి ఓ టర్నింగ్‌ పాయింట్‌గా ఉండనుంది. జీకే రెడ్డి, లోగు పాత్రలు చిత్ర కథకు ఎంతో బలాన్ని ఇవ్వడంతో పాటు ప్రాముఖ్యత కలిగిన పాత్రలుగా నిలుస్తాయని, ఈ పాత్రలకు వీరిద్దరిని కూడా పలు దశల ఆడిషన్స్‌ తర్వాత ఎంపిక చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.