హైదరాబాద్‌లో హీరో విశాల్‌ బిజీబిజీ

కోలీవుడ్‌ హీరో విశాల్‌ హైదరాబాద్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. గత మార్చి నెలలో విశాల్‌ ‘చక్ర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. వీటిలో ఒక సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ నగరంలో జోరుగా సాగుతోంది. ‘నాట్‌ ఏ కామన్‌మ్యాన్‌’ పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది విశాల్‌ 31వ చిత్రం. ఇదిలావుంటే, బాలా దర్శకత్వంతో విశాల్‌, ఆర్య నటించిన చిత్రం ‘అవన్‌ ఇవన్‌’. ఈ చిత్రం తర్వాత విశాల్‌ - ఆర్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో మూవీ ‘ఎనిమి’. ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటతో పాటు కొంత ప్యాచ్‌వర్క్‌ మాత్రమే మిగిలివుంది. 


ఈ నేపథ్యంలో తన 31వ చిత్రం షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో మకాం వేసివున్న విశాల్‌.. ‘ఎనిమి’ చిత్ర షూటింగ్‌ కూడా ఈ నెల 9వ తేదీ నుంచి ఇదే హైదరాబాద్‌లో చేపట్టేలా ప్లాన్‌ చేశారు. ఈ మూవీ ఫైనల్‌ షెడ్యూల్‌ను ఎనిమిది రోజుల పాటు కంటిన్యూగా చేపట్టాలని భావిస్తున్నారు. ఈ షూటింగులో విశాల్‌తో పాటు ఆర్య, ప్రకాష్‌ రాజ్‌, మృణాళిని తదితరులు పాల్గొనున్నారు. ఇందుకోసం ఎనిమి దర్శకుడు హైదరాబాద్‌కు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.