వరుణ్ తేజ్‌తో Detective విలన్ ఢీ ?

ABN , First Publish Date - 2022-05-18T16:42:25+05:30 IST

మెగా‌ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej) గత చిత్రం ‘గని’ (Ghani) బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. తాజా చిత్రం ‘ఎఫ్ 3’ (F3) ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో నవ్వుల సందడి చేయబోతోంది. తదుపరిగా వరుణ్.. ప్రవీణ్ సత్తారు (Praveen sattaru) దర్శకత్వంలో ఓ డిఫెరెంట్ రోల్ చేయబోతున్నాడు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

వరుణ్ తేజ్‌తో Detective విలన్ ఢీ ?

మెగా‌ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej) గత చిత్రం ‘గని’ (Ghani) బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. తాజా చిత్రం ‘ఎఫ్ 3’ (F3) ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో నవ్వుల సందడి చేయబోతోంది. తదుపరిగా వరుణ్.. ప్రవీణ్ సత్తారు (Praveen sattaru) దర్శకత్వంలో ఓ డిఫెరెంట్ రోల్ చేయబోతున్నాడు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. యస్వీసీసీ బ్యానర్ పై నాగబాబు సమర్పణలో బీవియన్ యస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా విశాల్ ‘డిటెక్టివ్’ (Detective) ఫేమ్ వినయ్ రాయ్ (Vinay Roy) విలన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. వరుణ్, వినయ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయని చెబుతున్నారు మేకర్స్.


తెలుగులో ‘వాన’ (Vana) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వినయ్ రాయ్ (Vinay Roy).. ఆ సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత తమిళ చిత్రం ‘తుప్పరివాలన్’ సినిమాలో క్రూయల్ అండ్ స్లైలిష్ విలన్ గా నటించి అందరినీ బాగా ఇంప్రెస్ చేశాడు. ఇదే సినిమా తెలుగులో ‘డిటెక్టివ్’ గా విడుదలై ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది.  దీని తర్వాత శివ కార్తికేయన్ (shiva karthikeyan) , నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson dileepkumar) ‘డాక్టర్’ (Doctor) చిత్రంలోనూ విలన్‌గా నటించి మెప్పించాడు. ఇందులోనూ అతడి స్టైలిష్ విలనిజం తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలతోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న కారణంగా ప్రవీణ్ సత్తారు .. అతడ్ని వరుణ్ తేజ్ విలన్ గా ఫిక్స్ చేశాడు. 


మార్చ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా.. వచ్చే నెల్లో లండన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతోంది. ప్రస్తుతం నాగార్జున (Nagarjuna) తో ‘ది ఘోస్ట్’ (The Ghost) మూవీ తెరకెక్కి్స్తున్న ప్రవీణ్ సత్తారు తదుపరిగా చేయబోయే సినిమా ఇదే. సంకల్పరెడ్డి ‘అంతరిక్షం’ చిత్రంలో వ్యోమగామిగా నటించిన వరుణ్ తేజ్.. ప్రవీణ్ సత్తారు  (Praveen sattaru) సినిమాలో ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటించనుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమాలో వరుణ్, వినయ్ రాయ్‌లు ఏ స్థాయిలో ఢీ కొట్టుకోనున్నారో చూడాలి. 

Updated Date - 2022-05-18T16:42:25+05:30 IST