కలయా... నిజమా?

ABN , First Publish Date - 2021-09-28T05:15:56+05:30 IST

‘‘సినిమాలో సందర్భానుసారంగా వచ్చే విషాదభరిత గీతం ఈ ‘కలయా... నిజమా’. గుండెల్ని పిండేసే విధంగా చిత్రీకరించారు. కాసర్ల శ్యామ్‌ ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు’’ అని చంద్రబోస్‌ అన్నారు. నాగవర్మ...

కలయా... నిజమా?

‘‘సినిమాలో సందర్భానుసారంగా వచ్చే విషాదభరిత గీతం ఈ ‘కలయా... నిజమా’. గుండెల్ని పిండేసే విధంగా చిత్రీకరించారు. కాసర్ల శ్యామ్‌ ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు’’ అని చంద్రబోస్‌ అన్నారు. నాగవర్మ బైర్రాజు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘విక్రమ్‌’. హరిచందన్‌ దర్శకుడు. ‘కలయా... నిజమా’ పాటను చంద్రబోస్‌ విడుదల చేశారు. అనంతరం ‘‘సంగీతభరిత ప్రేమకథకు థ్రిల్లర్‌ అంశాలు మేళవించి కొత్త పంథాలో తీసిన చిత్రమిది. ప్రేమించిన అమ్మాయిని పొందడానికి సినిమా రచయిత ఏం చేశాడన్నది కథ’’ అని దర్శకుడు చెప్పారు. నాగవర్మ బైర్రాజు ‘‘అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

Updated Date - 2021-09-28T05:15:56+05:30 IST