‘విక్రమ్‌’ వస్తున్నాడు

ABN , First Publish Date - 2022-03-15T05:30:00+05:30 IST

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెరకెక్కించింది. కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ నిర్మాతలు....

‘విక్రమ్‌’ వస్తున్నాడు

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెరకెక్కించింది. కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. జూన్‌ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


‘‘ఖైదీ, మాస్టర్‌ చిత్రాలతో లోకేష్‌ కనగరాజ్‌ అగ్ర శ్రేణి దర్శకుడిగా మారిపోయారు. కమల్‌ హాసన్‌తో లోకేష్‌ సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే ఈ చిత్రాన్ని రూపొందించారు. విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఫహద్‌ కూడా శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. అన్ని రకాలుగా ఈ కాంబినేషన్‌ సంచలనం సృష్టిస్తుందన్న నమ్మకం ఉంద’’ని చిత్రబృందం తెలిపింది. కాళిదాస్‌ జయరామ్‌, నరైన్‌, శివానీ నారాయణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్‌, కెమెరా: గిరీష్‌ గంగాధరన్‌.


Updated Date - 2022-03-15T05:30:00+05:30 IST