రైతు కాలిని ముద్దాడుతూ.. ‘విక్కీ ది రాక్ స్టార్’ మోషన్ పోస్టర్

ABN , First Publish Date - 2022-04-22T22:20:28+05:30 IST

శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విక్రమ్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘విక్కీ ది రాక్‌స్టార్’. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని వైవిధ్యభరితమైన కథాంశంతో

రైతు కాలిని ముద్దాడుతూ.. ‘విక్కీ ది రాక్ స్టార్’ మోషన్ పోస్టర్

శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విక్రమ్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘విక్కీ ది రాక్‌స్టార్’. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని వైవిధ్యభరితమైన కథాంశంతో దర్శకుడు సిఎస్ గంటా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత శ్రీనివాస్ నూతలపాటి(ఐఏఎఫ్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సుభాష్, చరితలు తెలుపుతున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది.

KGF 2: చిత్రబృందంపై ఐకాన్ స్టార్ ప్రశంసల జల్లు

నేలపై సాగు చేసే రైతు ఆకాశం వైపుకి, ఆకాశమే హద్దుగా భావించే యువత నేల వైపుకి, ఒక వైపు నాగలితో రైతన్న, మరో వైపు గిటార్‌తో విక్కి ది రాక్ స్టార్ రైతు కాలికి ముద్దు పెడుతూ ఉన్న ఈ పోస్టర్‌ని ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ‘నీ కాళ్ళకే ముద్దులె పెట్టనా ఫార్మర్’ అంటూ బ్యాక్‌గ్రాండ్‌లో లిరిక్ వినిపిస్తోంది. కాగా, పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. 



Updated Date - 2022-04-22T22:20:28+05:30 IST