తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ తమిళ సినీనటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కుడి కాలి వేలిని వైద్యులు తొలగించారు. విజయకాంత్ గత కొన్నేళ్లుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో సాధారణ వైద్యపరీక్షల కోసం చేరగా... మధుమేహం అధికం కావటంతో కుడి కాలి వేలికి రక్త ప్రసరణ జరగడంలేదని వైద్యులు గుర్తించారు. దానివల్ల ఆ వేలు కుళ్ళిపోయే అవకాశం ఉండటంతో సోమవారం దానిని తొలగించారు. కాగా విజయకాంత్ ఆరోగ్యంపట్ల అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్ క్షేమంగా వున్నారని, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
చెన్నై (ఆంధ్రజ్యోతి)