Vijaya Shanti: ‘కర్తవ్యం’ను ఓ దశలో ఆపేద్దామనుకున్నారు: విజ‌య‌శాంతి

ABN , First Publish Date - 2021-08-04T16:37:55+05:30 IST

లేడీ అమితాబ్ బచ్చన్.. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో తెలుగు సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న న‌టి విజ‌య శాంతి. ఈమెకు ఇటు క్లాస్‌, అటు మాస్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఉన్న ఇమేజ్‌ను రెట్టింపు చేసిన చిత్రం ‘క‌ర్త‌వ్యం’. తొలి మ‌హిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఎ.మోహ‌న‌గాంధీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

Vijaya Shanti: ‘కర్తవ్యం’ను ఓ దశలో ఆపేద్దామనుకున్నారు:  విజ‌య‌శాంతి

లేడీ అమితాబ్ బచ్చన్.. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో తెలుగు సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న న‌టి విజ‌య శాంతి. గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెప్పించిన ఈమె పెర్ఫామెన్స్ సినిమాల‌తోనూ ఆక‌ట్టుకున్నారు. అంతే కాదు.. యాక్ష‌న్ సినిమాల‌తో బాక్సాఫీస్ దగ్గ‌ర క‌లెక్ష‌న్స్ ప్ర‌భంజ‌నాన్ని సృష్టించారు. విజ‌య‌శాంతికి ఇటు క్లాస్‌, అటు మాస్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఉన్న ఇమేజ్‌ను రెట్టింపు చేసిన చిత్రం ‘క‌ర్త‌వ్యం’. తొలి మ‌హిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఎ.మోహ‌న‌గాంధీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. 1990లో విడుద‌లైన ఈ చిత్రం విజ‌య‌శాంతి ఇమేజ్‌ను రెట్టింపు చేసింది. ‘కర్తవ్యం’ గురించి ఆమె మాట్లాడుతూ ..


‘‘ విజయశాంతి ఏ పాత్రనైనా చేయ‌గ‌లుగుతుంది అని అంద‌రికీ అర్థ‌మైంది. ‘ప్ర‌తిఘ‌ట‌న’ చిత్రంతో సూప‌ర్‌స్టార్ రేంజ్‌కు చేరుకున్నాను. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్ చేస్తున్న‌ అలాంటి స‌మ‌యంలో ఏదో ఒక‌టి డిఫ‌రెంట్‌గా చేయాల‌నిపించింది. అప్పుడు వ‌చ్చిన ఆలోచ‌నే పోలీస్ క్యారెక్ట‌ర్‌. ఆ ఆలోచిన నా భ‌ర్త శ్రీనివాస్ ప్ర‌సాద్‌గారికి వ‌చ్చింది. నిజానికి  సూర్యా మూవీస్ బ్యాన‌ర్‌లో ఎ.ఎం.ర‌త్నం పేరు నిర్మాత‌గా వేసినా, సినిమా చేసిందంతా శ్రీనివాస్ ప్ర‌సాద్‌గారే. కిర‌ణ్ బేడిగారి పాత్ర‌ను స్ఫూర్తిగా చేసుకుని క‌థ‌ను రాశారు. ఈ క‌థ‌ను త‌యారు చేసే క్ర‌మంలో కిర‌ణ్ బేడిగారిని కూడా క‌లిశాం. ఆమె కొన్ని విషయాల‌ను వివ‌రించారు. క‌థ‌ను త‌యారు చేసే క్ర‌మంలో ఒకానొక ద‌శ‌లో కథ ఎటెటో వెళుతుందనిపించి, శ్రీనివాస్ ప్ర‌సాద్‌గారు సినిమాను ఆపేద్దామ‌ని కూడా అనుకున్నారు. మళ్లీ మనసు మార్చుకున్నారు. డైరెక్ట‌ర్ మోహ‌న‌గాంధీగారు, రైట‌ర్స్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, శ్రీనివాస్ ప్ర‌సాద్‌గారు స‌బ్జెక్ట్ మీద చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రం టీమ్ వ‌ర్క్‌లా చేయ‌డంతో ‘క‌ర్తవ్యం’ క‌థ అద్భుతంగా వ‌చ్చింది. ఆ సినిమాకు క‌ష్ట‌ప‌డ్డ వారంద‌రికీ ఋణ‌ప‌డి ఉంటాను’’ అని తెలిపారు. 

Updated Date - 2021-08-04T16:37:55+05:30 IST