ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, థర్డ్ లుక్.. ట్రెండ్ సెట్టర్‌గా ‘Vaarasudu’

Twitter IconWatsapp IconFacebook Icon
ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, థర్డ్ లుక్.. ట్రెండ్ సెట్టర్‌గా Vaarasudu

Vaarasudu: దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu), తమిళ్‌లో ‘వారిసు’ (Varisu) అనే టైటిల్స్‌ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. ‘ది బాస్ రిటర్న్స్’ అనేది ట్యాగ్‌లైన్‌తో.. పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆ టైటిల్ యాప్ట్ అని అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇక టైటిల్‌తో పాటు దళపతి విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేయగా.. వెంటవెంటనే సెకండ్ లుక్, థర్డ్ లుక్ కూడా విడుదల చేసి.. ‘వారసుడు’ టైటిల్‌‌ని ట్రెండ్ అయ్యేలా చేశారు మేకర్స్. 

ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, థర్డ్ లుక్.. ట్రెండ్ సెట్టర్‌గా Vaarasudu

సినిమా టైటిల్‌తో పాటు.. వరుసగా విడుదలైన మూడు లుక్స్‌తో ఈ ‘వారసుడు’ ట్రెండ్ సెట్టర్‌గా నిలవడం విశేషం. ఫస్ట్ లుక్‌లో స్టయిలీష్ గా కనిపిస్తూనే సీరియస్‌ మోడ్‌లో విజయ్ ఆకర్షిస్తే.. సెకండ్ లుక్‌లో పిల్లల మధ్య నవ్వుతూ కనిపించి.. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనేలా క్లారిటీ ఇచ్చేశారు. ఇక మూడో లుక్‌లో బైక్‌పై కూర్చుని.. విజయ్ తన మార్క్ స్టైల్‌ని ప్రదర్శించారు. మొత్తంగా ఈ మూడు లుక్స్‌తో గురువారం సోషల్ మీడియాని విజయ్ షేక్ చేశారు. 

ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, థర్డ్ లుక్.. ట్రెండ్ సెట్టర్‌గా Vaarasudu

విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో.. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్‌పై కీలకమైన భారీ షెడ్యూల్‌ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకి ఎంతో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్‌ప్లేను అందించగా.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.