Vijay: వారసుడు సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్.. ఎన్ని కోట్లంటే..?

ABN , First Publish Date - 2022-10-23T22:16:48+05:30 IST

కొలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయదలపతి విజయ్ (Ilayathalapathy Vijay). ‘విజిల్’ (Vigil), ‘సర్కార్’ (Sarkar), ‘బీస్ట్’ (Beast) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు

Vijay: వారసుడు సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్.. ఎన్ని కోట్లంటే..?

కొలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయదలపతి విజయ్ (Ilayathalapathy Vijay). ‘విజిల్’ (Vigil), ‘సర్కార్’ (Sarkar), ‘బీస్ట్’ (Beast) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా అతడు నటిస్తున్న సినిమా ‘వారసుడు’ (Varasudu). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. 


‘వారసుడు’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం. స్ట్రీమింగ్ రైట్స్‌‌కు దాదాపుగా రూ.60కోట్ల భారీ ధర చెల్లించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. శాటిలైట్ రైట్స్‌కు సన్ టీవీ రూ.50కోట్ల ఆఫర్ ఇచ్చిందట. ఓవర్సీస్, హిందీ డబ్బింగ్ రైట్స్‌కు రూ.70కోట్లు వస్తాయని సమాచారం. టాప్ మ్యూజిక్ కంపెనీ ఆడియో రైట్స్‌కు రూ.10కోట్లు చెల్లించిందని తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.32కోట్లు, ఓవర్సీస్ రైట్స్‌కు మరో రూ. 32కోట్లు, కేరళ, కర్ణాటక, తమిళనాడు బిజినెస్ టాక్స్ చివరి దశలో ఉన్నట్టు సమాచారం. వారసుడు మూవీ విడుదలకు ముందే రూ.275కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, శ్యామ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘వారసుడు’ లో విజయ్ ఓ పాటను ఆలపించాడు. ఆ సాంగ్ త్వరలోనే విడుదల కానుంది. ఇక విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. ‘వారసుడు’ అనంతరం లోకేశ్ కనకరాజ్‌తో సినిమా చేయనున్నాడు. ‘విక్రమ్’ తర్వాత లోకేశ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. అట్లీతోను విజయ్ ఓ సినిమా చేయాలి. లోకేశ్ మూవీ తర్వాత వీరిద్దరు కలసి పనిచేసే అవకాశం ఉంది.   

Updated Date - 2022-10-23T22:16:48+05:30 IST