40 రోజుల్లో పూర్తికానున్న విజయ్ ‘బీస్ట్’ మూవీ

ABN , First Publish Date - 2021-10-21T20:25:10+05:30 IST

దళపతి విజయ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఆయన గత చిత్రాలన్నీ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడంత, ఆయన తాజా చిత్రం ‘బీస్ట్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మెప్పించబోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

40 రోజుల్లో పూర్తికానున్న విజయ్ ‘బీస్ట్’ మూవీ

దళపతి విజయ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఆయన గత చిత్రాలన్నీ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడంతో, ఆయన తాజా చిత్రం ‘బీస్ట్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మెప్పించబోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటికే మేజారిటీ పార్ట్ చిత్రీకరణను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా 40 రోజుల్లో సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుందట. డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నది దర్శకుడి ప్లాన్. 



ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా క్లైమాక్స్ షూట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఇటీవల డైరెక్ట్ చేసిన ‘డాక్టర్’ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ‘వరుణ్ డాక్టర్’ గా తెలుగులోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సైతం ఎర్లియర్ గా ‘మాస్టర్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్, యోగాబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. అయితే ఇంకా తెలుగు టైటిల్ నిర్ణయించలేదు.  

Updated Date - 2021-10-21T20:25:10+05:30 IST