తమిళ దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు విజయ్ మాస్టర్ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ‘బీస్ట్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కిడ్నాపింగ్ కథాంశంతో, గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోంది. కొద్ది రోజులకు ముందే చిత్రీకరణను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇదివరకు విడుదలైన ఈ సినిమా సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక ‘బీస్ట్’ చిత్రాన్ని ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
నిజానికి ఏప్రిల్ 14న పాన్ ఇండియా సినిమా ‘కేజీఎఫ్ 2’ విడుదల కాబోతోంది. దీనికి ఒక్క రోజు ముందుగా ‘బీస్ట్’ చిత్రం విడుదల కానుండడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ రెండు సినిమాలకు క్లాష్ తప్పదని చర్చించుకుంటున్నారు. ఈ రెండు సినిమాలకి మంచి క్రేజ్ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా పైచేయి సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. మరి ‘కేజీఎఫ్ 2’ మూవీ కి బీస్ట్ ఏ స్థాయిలో పోటీ ఇస్తుందో చూడాలి.