‘ది ఫ్యామిలీ మేన్’ సెట్స్‌లోకి విజయ్ సేతుపతి

ABN , First Publish Date - 2021-08-02T17:53:08+05:30 IST

బిజియెస్ట్ స్టార్.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశాడు. ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు.

‘ది ఫ్యామిలీ మేన్’ సెట్స్‌లోకి విజయ్ సేతుపతి

బిజియెస్ట్ స్టార్.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశాడు. ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఎప్ప‌టి నుంచో షూటింగ్ జ‌రుగుతుంది. కొత్త షెడ్యూల్ మాత్రం రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. బిజీ షెడ్యూల్ కార‌ణంగా త‌న పాత్ర‌కు న‌చ్చిన చిత్రీక‌ర‌ణంతా సింగిల్ షెడ్యూల్‌లోనే పూర్తి చేసేలా విజ‌య్ సేతుప‌తి డేట్స్‌ను కేటాయించిన‌ట్టు స‌మాచారం. షాహిద్ కపూర్‌, రాశీఖ‌న్నా కూడా ఈ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెమ్యున‌రేష‌న్ కూడా విజ‌య్ సేతుప‌తికి భారీగానే అందిన‌ట్టు స‌మాచారం. ‘ది ఫ్యామిలీ మేన్’ రెండు సీజ‌న్స్ త‌ర్వాత రాజ్ అండ్ డీకే చేస్తున్న ఈ వెబ్ సిరీస్ ఏ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసార‌మ‌వుతుంద‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. 

Updated Date - 2021-08-02T17:53:08+05:30 IST