Vijay Sethupathi: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బయోపిక్‌లో విజయ్‌ సేతుపతి?

ABN , First Publish Date - 2022-12-01T14:57:44+05:30 IST

కర్ణాటక రాజకీయాల్లో సీనియర్‌ మోస్ట్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కనుంది..

Vijay Sethupathi: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బయోపిక్‌లో విజయ్‌ సేతుపతి?

కర్ణాటక రాజకీయాల్లో సీనియర్‌ మోస్ట్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కనుంది. ఇందులో మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై విజయ్‌ సేతుపతిని ఆ చిత్ర నిర్మాతలు సంప్రదించనున్నట్టు వినికిడి. గత ఆగస్టు 3వ తేదీ సిద్ధరామయ్య తన 75వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.


ఈ నేపథ్యంలో ఆయన మద్దతుదారులు బయోపిక్‌ తెరకెక్కించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో రీల్‌ సిద్ధరామయ్యగా విజయ్‌ సేతుపతి సరిగా సూటవుతారని భావించి, ఆయనను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీలో ఒక్క సీన్‌లో కూడా సిద్ధరామయ్య కనిపించే అవకాశాలు లేవని ఆయన అనుచరులు అంటున్నారు. అదేసమయంలో ఈ బయోపిక్‌కు ఈ మాజీ ముఖ్యమంత్రి అనుమతివ్వాల్సి ఉంది.

Updated Date - 2022-12-01T14:57:44+05:30 IST