విజయ్ సేతుపతి ‘లాభం’ టాకేంటి?

ABN , First Publish Date - 2021-09-10T00:26:57+05:30 IST

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఆయన హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ‘లాభం’ చిత్రం గురువారం (సెప్టెంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినాయక చవితి

విజయ్ సేతుపతి ‘లాభం’ టాకేంటి?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఆయన హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ‘లాభం’ చిత్రం గురువారం (సెప్టెంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ముఖ్యంగా రైతుల సమస్యపై తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటన హైలెట్‌ అనేలా ప్రేక్షకుల నుంచి స్పందన అందుకుంటోంది. రైతు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన హీరో.. ప్రజల కోసం ఎలాంటి మంచి పనులు చేశాడు, పెత్తం దారుల ఆటలని ఎలా అడ్డుకున్నాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా దర్శకుడు రూపొందించాడు. ఇనాం భూముల వెన‌క చ‌రిత్ర‌, రైతులు ఇంకా పేద‌వాళ్లుగా మిగిలిపోవ‌డానికి కార‌ణాల్ని ఈ చిత్రంలో చక్కగా చూపించారు. కథే బలంగా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాతలు కూడా కాంప్రమైజ్ కాకుండా రిచ్‌గా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులనే కాదు.. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేదిగా ఈ చిత్రం ఉందనేలా ‘లాభం’ చిత్రం టాక్‌ని సొంతం చేసుకుంది.

Updated Date - 2021-09-10T00:26:57+05:30 IST