‘పిశాచు-2’లో విజయ్‌ సేతుపతి గెస్ట్‌రోల్‌

ABN , First Publish Date - 2021-09-19T18:59:53+05:30 IST

సాధారణంగా చాలా మంది హీరోలు... హీరోయిజం ఉన్న పాత్రలనే చేస్తానని భీష్మించుకుని కూర్చోడం చూస్తుంటాం. కానీ విజయ్‌ సేతుపతి మాత్రం తన వద్దకు వచ్చే ప్రతి పాత్రలో నటించి, ఆ పాత్రకు న్యాయం చేసేందుకు ఇష్టపడతారు.

‘పిశాచు-2’లో విజయ్‌ సేతుపతి గెస్ట్‌రోల్‌

సాధారణంగా చాలా మంది హీరోలు... హీరోయిజం ఉన్న పాత్రలనే చేస్తానని భీష్మించుకుని కూర్చోడం చూస్తుంటాం. కానీ విజయ్‌ సేతుపతి మాత్రం తన వద్దకు వచ్చే ప్రతి పాత్రలో నటించి, ఆ పాత్రకు న్యాయం చేసేందుకు ఇష్టపడతారు. అందుకోసం తన క్యాల్షీట్లను సర్దుబాటు చేసేందుకు కృషిచేస్తారు. ఒక వారానికి రెండు చొప్పున ఆయన నటించిన చిత్రాలు విడుదలవుతున్నాయంటే... ఆయన ఏ రేంజ్‌లో బిజీగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. దెయ్యం చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే అగ్ర దర్శకుల్లో ఒకరిగా గుర్తింపుపొందిన మిస్కిన్ తెరకెక్కిస్తున్న ‘పిశాచు-2’ చిత్రంలో విజయ్‌ సేతుపతి గెస్ట్‌ అప్పీరెన్స్‌ పాత్రలో కనిపించనున్నారు. దీనిపై విజయ్‌ సేతుపతి స్పందిస్తూ, ‘పిశాచు’ కథ విన్నాను. నాకు ఎంతగానో నచ్చింది. కథతో పాటు పాత్రలను క్రియేట్‌ చేసిన తీరు అద్భుతం. ఇందులో నాకు కూడా ఏదో ఒక చిన్న పాత్రను ఇవ్వాలని కోరగా ఆయన వెంటనే అంగీకరించారు. మిస్కిన్ దర్శకత్వంలో పని చేయడం ఎంతో సంతోసంగా ఉంది’ అని విజయ్‌ సేతుపతి పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-19T18:59:53+05:30 IST