Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక.. మాల్దీవుల షికారుకు వెళ్తున్నారా..?

ABN , First Publish Date - 2022-10-07T21:19:27+05:30 IST

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో బెస్ట్ ఆన్‌స్క్రీన్ ఫెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna). వీరిద్దరి కెరీర్ ఫుల్ జోష్‌తో దూసుకుపోతుంది.

Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక.. మాల్దీవుల షికారుకు వెళ్తున్నారా..?

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో బెస్ట్ ఆన్‌స్క్రీన్ ఫెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna). వీరిద్దరి కెరీర్ ఫుల్ జోష్‌తో దూసుకుపోతుంది. వరుస సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. చిత్రాల నుంచి వీరిద్దరికి విరామం లభించడంతో సరదాగా హాలీడేను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విదేశాలకు పయనమైన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.   


విజయ్ దేవర కొండ ఈ మధ్యనే ‘లైగర్’ (Liger) ను విడుదల చేశాడు. ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా శ్రమించాడు. ఈ మూవీ విడుదల అనంతరం తర్వాతి ప్రాజెక్టు ‘ఖుషి’ పై దృష్టిసారించాడు. ప్రస్తుతం సమంత డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ‘ఖుషి’ చిత్రీకరణ కొనసాగడం లేదు. అయితే, రష్మిక మందన్న బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘గుడ్ బై’ (Goodbye) హిందీ చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదల చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విపరీతంగా కష్టపడింది. ప్రస్తుతం ఎటువంటి షూటింగ్స్, ప్రమోషన్స్ లేకపోవడంతో వర్క్ లైఫ్ నుంచి కొంత విరామం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై ఎయిర్‌పోర్టులో అక్టోబర్ 7న విజయ్, రష్మిక వేర్వేరుగా దర్శనమిచ్చారు. తొలుత ఎయిర్ పోర్టుకు వచ్చిన  రష్మిక ఫొటోగ్రాఫర్స్‌కు ఫోజులిస్తూ లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే విజయ్ సైతం ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విజయ్, రష్మిక కలసి మాల్దీవుల టూర్‌కు వెళ్తున్నారంటూ బీ టౌన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో విజయ్, రష్మిక ప్రేమించుకుంటున్నారనే వార్తలు మరోసారి గట్టిగా షికార్లు కొట్టడం మొదలయ్యాయి. 


కొన్ని రోజుల క్రితమే విజయ్‌తో రిలేషన్ షిప్‌పై రష్మిక స్పందించింది. ‘‘మా కెరీర్ ప్రారంభంలో నేను, విజయ్ కలసి అనేక సినిమాలు చేశాం. అప్పట్లో మాకు ఇండస్ట్రీ గురించి అవగాహన లేదు. మా ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండటంతో స్నేహితులుగా మారాం. హైదరాబాద్‌లో నాకొక గ్యాంగ్ ఉంది. విజయ్‌కొక గ్యాంగ్ ఉంది. మా ఇద్దరికి అనేక మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందువల్ల ప్రపంచమంతా మా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. వాటిని చూస్తే చాలా క్యూట్‌గా అనిపిస్తుంది’’ అని రష్మిక అప్పట్లో చెప్పింది.  





Updated Date - 2022-10-07T21:19:27+05:30 IST