విజయ్ - కుక్క- ఛార్టెడ్ ఫ్లైట్

ABN , First Publish Date - 2022-01-20T04:02:53+05:30 IST

ఈ మధ్యకాలంలో చిన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్లకి, సక్సెస్ మీట్స్‌కి స్పెషల్ ఫ్లైట్స్‌ని వినియోగించుకోవడం చాలా సహజమైన విషయంగా మారిపోయింది. ముఖ్యంగా పెద్ద హీరోలందరూ ఈ పద్ధతినే పాటిస్తున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ

విజయ్ - కుక్క- ఛార్టెడ్ ఫ్లైట్

ఈ మధ్యకాలంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్లకి, సక్సెస్ మీట్స్‌కి స్పెషల్ ఫ్లైట్స్‌ని వినియోగించుకోవడం చాలా సహజమైన విషయంగా మారిపోయింది. ముఖ్యంగా పెద్ద హీరోలందరూ ఈ పద్ధతినే పాటిస్తున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్క(స్టార్మ్‌)ని ఫ్లైట్‌లో తీసుకెళుతోన్న వీడియో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తన తోటి సహచరులని, స్టాఫ్‌ని తీసుకెళ్లడం చూశాం కానీ.. కుక్కను ఫ్లైట్‌లో తీసుకెళ్లిన నటుడు మాత్రం విజయ్ దేవరకొండే అని చెప్పుకోవచ్చు. దీనిపై నెటిజన్లు కొందరు పలు రకరకాలుగా స్పందిస్తున్నారు. వాస్తవానికి హాలీవుడ్‌‌లో ఇలా తమ పెంపుడు జంతువులను పట్టుకెళ్లడం అనేది సాధారణ విషయం. మన దేశంలో కూడా ఛార్టెడ్ ఫ్లైట్స్ సంస్కృతి ముందు బాలీవుడ్‌కి, ఆ తర్వాత టాలీవుడ్ చేరుకుంది. అయినా ఇప్పటి వరకు కుక్కలను పట్టుకెళ్లే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు.. విజయ్ మాత్రమే దీనికి తెరలేపారు. మొదటి నుండి అందరికీ భిన్నంగా ప్రవర్తించడం అనేది ఆయనకి అలవాటే. కోవిడ్ సమయంలో సాయం చేస్తానని ముందుకు వచ్చి వివాదంలో చిక్కుకున్నా.. ‘దేవరశాంటా’ అని చెప్పి 100 మందికి 10 వేలు ఇవ్వడం.. ఇప్పుడు ఇలా.. ఈ విధంగా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విభిన్నతే.. హిట్టు సినిమా పడి చాలా కాలం అవుతున్నా.. విజయ్‌ క్రేజ్‌ని తగ్గనీయడం లేదు. 


అయితే ఇప్పుడు విజయ్ చేసిన ఈ పనిపై మాత్రం కొందరు నెటిజన్లు సెటైరికల్‌గా రియాక్ట్ అవుతున్నారు. ‘ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఇటువంటివి అవసరమా?’ అని కొందరు అంటుంటే, ‘దీనికి పెట్టిన ఖర్చుతో ఎంతోమంది పేదవారిని ఆదుకోవచ్చు.. మనీని మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు’ అనేలా మరికొందరు కామెంట్స్ చేశారు. తన పెంపుడు కుక్కను ఫ్లైట్ ఎక్కించడంలో తప్పు లేదు కానీ.. ఇలా సోషల్ మీడియాలో ఆ వీడియోని పెట్టి సరదా పడటమే ఏమంత బాలేదు అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇంకొందరైతే.. ‘ఇన్‌కమ్ టాక్స్ వాళ్లకి ఇవేవీ కనబడవా?’ అనేలా కూడా కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్లపై విజయ్ ఎలా స్పందిస్తాడో..?  కాగా, ప్రస్తుతం ఈ రౌడీ హీరో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. 



Updated Date - 2022-01-20T04:02:53+05:30 IST