అనుష్కతో విజయ్ దేవరకొండ..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించబోతున్న కొత్త చిత్రంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'బాహుబలి' ఫ్రాంఛైజీ తర్వాత అనుష్క శెట్టికి మళ్ళీ ఇప్పటివరకు భారీ హిట్ దక్కలేదు. గత చిత్రం 'నిశ్శబ్ధం' ఈమె అభిమానులను బాగా నిరాశపరచింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించని అనుష్క, త్వరలో యూవీ క్రియేషన్స్‌ నిర్మించబోయో ఓ విభిన్న ప్రేమకథా చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి 'రా రా కృష్ణయ్య' ఫేం మహేశ్‌ దర్శకత్వం వహిస్తున్నాడని, 25 ఏళ్ల యువకుడికి - 40 ఏళ్ల మహిళ మధ్య ఆసక్తికరంగా సాగే కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ప్రేక్షకుల్లో మాత్రం ఆసక్తి పెరిగింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న ఓ కీలక పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుండగా 'మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.