మెగాస్టార్‌కి విజయ్ దేవరకొండ ఫుల్ సపోర్ట్ ..!

మెగాస్టార్‌కి విజయ్ దేవరకొండ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ కోసం చర్చించేదుకు సినీ ఇండస్ట్రీ నుంచి నిన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశాన్ని మరో కోణంలో చూస్తూ చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దాంతో  ట్విట్టర్ వేదికగా ఈ వార్తలపై స్పందించిన చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదని, దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దంటూ.. ఈ వార్తలకి, చర్చలకు ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఆయన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, దీనికి #GiveNewsNotViews అనే హ్యాష్ ట్యాగ్‌ని కూడా జోడించారు.

చిరంజీవి పెట్టిన #GiveNewsNotViews హ్యాష్ ట్యాగ్‌కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'మై ఫుల్ సపోర్ట్' అంటూ మద్ధతు తెలిపి ట్వీట్ చేశాడు. గతంలో విజయ్ దేవరకొండపై తప్పుడు వార్తలను ప్రచారం చేసిన ఓ వెబ్ మీడియాపై తాను సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇండస్ట్రీలో చాలా మంది విజయ్‌కి మద్ధతు తెలిపారు. ఇప్పుడు మెగాస్టార్‌కు విజయ్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.