మళ్ళీ పూరీతో ‘లైగర్’ బాయ్?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో రూపొందుతోన్న ఈ సినిమా హిందీ వెర్షన్ ను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ మధ్యనే యూఎస్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చింది ‘లైగర్’ టీమ్. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో విజయ్ తలపడే సన్నివేశాల్ని, పలు కీలక సన్నివేశాల్ని ఆ షెడ్యూల్ లోనే చిత్రీకరించారు. ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ‘లైగర్’ టీజర్ అభిమానుల్ని ఎంతగానో అలరించింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. రీసెంట్ గా ఈ మూవీ ఔట్ పుట్ చూసిన విజయ్.. పూరీ బ్రిలియన్సీకి చాలా ఇంప్రెస్ అయ్యాడట. అందుకే ఆయనతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది.


నిజానికి విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయాల్సి ఉంది. అంతకన్నా ముందుగానే పూరీతో మరో చిత్రం చేయాలన్నది విజయ్ ప్లాన్ గా తెలుస్తోంది. ‘లైగర్’ ఇంకా విడుదల కాకుండానే విజయ్.. పూరీతో నెక్ట్స్ మూవీని కూడా చేయబోతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో ‘లైగర్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి విజయ్ నిజంగానే పూరీతో తదుపరి చిత్రాన్ని కూడా చేస్తాడా అన్నది వేచి చూడాలి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.