Vijay Devarakonda : ఈ సారి ‘యమ’ ఫాంటసీ ?

Twitter IconWatsapp IconFacebook Icon
Vijay Devarakonda : ఈ సారి యమ ఫాంటసీ ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కలయికలో ప్రస్తుతం ‘లైగర్’ (Liger) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగానూ, పాన్ ఇండియా స్థాయిలోనూ థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. బాక్సింగ్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటిస్తోంది. ఇందులో  ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ తండ్రిగా ఆయన కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే, విజయ్, పూరీ కాంబినేషన్ లో రెండో చిత్రంగా జనగణమన (JGM) చిత్రాన్ని అనౌన్స్ చేశారని తెలిసిందే. ‘లైగర్’ మూవీ విడుదల కాగానే.. JGM చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోంది. 

ఇక ‘జగగణమన’ చిత్రం తర్వాత విజయ్, పూరీల కలయికలో మరో సినిమా కూడా రాబోతోందని ఇదివరకే వార్తలొచ్చాయి. ఈ సినిమా కూడా అభిమానుల్ని అలరించే వైరైటీ కథతో తెరకెక్కబోతోందని సమాచారం అందుతోంది. కాకపోతే ఈ సారి ఈ డ్యుయో జోనర్ మార్చబోతున్నట్టు టాక్.  ‘యమదొంగ’ (Yamadonga) తరహాలోని ఫాంటసీ కథతో అభిమానులకు వినోదాన్ని అందించబోతున్నట్టు వినికిడి. ‘దేవాంతకుడు, యమగోల, యముడికి మొగుడు, యమగోల మళ్ళీ మొదలైంది, యమజాతకుడు, యమాయనమః’ లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఏ స్థాయిలో వినోదాన్ని అందించాయో తెలిసిందే. ఈ సారి యమలోకంలో రౌడీ హీరో రచ్చ చేయనుండడం విశేషమని చెప్పాలి. 

పూరీ జగన్నాథ్ గతంలో రవితేజ (Raviteja), ఇలియానా (Iliana) జంటగా ‘దేవుడు చేసిన మనుషులు’ (Devuduchesina Manushulu) అనే ఫాంటసీ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందులో బ్రహ్మానందం (Brahmanandam) విష్ణుమూర్తిగానూ, కోవై సరళ (Kovai Sarala) లక్ష్మీదేవిగానూ నటించిన సంగతి తెలిసిందే. సినిమా అంతగా ఆడలేదు కానీ, పూరీ కెరీర్ లోనే ఇది డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి పూరీ జగన్నాథ్ ఫాంటసీ చిత్రం రూపొందించనుండడం విశేషంగా మారింది. ‘జగగణమన’ చిత్రం విడుదల కాగానే ఈ సినిమా అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే పూరీ ఈ సినిమా బేసిక్ ప్లాట్‌ను రెడీ చేశాడని సమాచారం. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుందట. మరి ఈ యమ ఫాంటసీ విజయ్‌కు ఏ మేరకు సెట్ అవుతుందో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.