Vijay Antony : విడుదలకు సిద్దమైన తాజా చిత్రం

ABN , First Publish Date - 2022-08-15T16:27:33+05:30 IST

‘నకిలి (Nakili), డాక్టర్ సలీమ్ (Doctor Saleem)’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనుసు దోచుకున్నాడు తమిళ హీరో విజయ్ ఆంటనీ (Vijay Antony). ‘బిచ్చగాడు’ (Bichagadu) బ్లాక్ బస్టర్ హిట్ తో మరింతగా దగ్గరయ్యాడు.

Vijay Antony : విడుదలకు సిద్దమైన తాజా చిత్రం

‘నకిలి (Nakili), డాక్టర్ సలీమ్ (Doctor Saleem)’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనుసు దోచుకున్నాడు తమిళ హీరో విజయ్ ఆంటనీ (Vijay Antony). ‘బిచ్చగాడు’ (Bichagadu) బ్లాక్ బస్టర్ హిట్ తో మరింతగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాలు వచ్చినప్పటికీ.. అవి అంతగా మ్యాజిక్ చేయలేకపోయాయి. తాజాగా విజయ్ మరో వెరైటీ తమిళ మూవీతో రాబోతున్నాడు. సినిమా పేరు కొలై (Kolai). తెలుగులో ఈ సినిమా ‘హత్య’ (Hatya) గా రాబోతోంది.


కమల్‌ బోరా, జి.ధనుంజయన్‌, ప్రదీప్‌ పి.పంకజ్‌ బోరా, సిద్ధార్థ్‌ శంకర్‌, ఆర్‌వీఎస్‌ అశోక్‌ కుమార్‌, టాన్సీ దురైసింగం పిళ్ళైలు ఇన్ఫినిటీ వెంచర్స్‌, లూటస్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా బాలాజీ కె.కుమార్‌ (Balaji K Kumar) దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. 


త్వరలో ఈ చిత్రం విడుదలకానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ ‘ఇంతమంది దర్శకులతో కలిసి పని చేయడం సంతోషం.  ఈ చిత్ర నిర్మాతలు కోలీవుడ్‌కు ఓ వరం.  హీరోయిన్లు రితికా సింగ్‌ (Rithika Singh), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) లతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది’ అని అన్నారు. దర్శకుడు బాలాజీ కె.కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి కారకులు విజయ్‌ ఆంటోనీ, కథ చెప్పగానే హీరో అందులో లీనమైపోయారు. ప్రతి ఒక్క నిర్మాతకు ధన్యవాదాలు’ తెలిపారు. హీరోయిన్లతో పాటు నిర్మాతలు, దర్శకుడు మిష్కిన్‌, నిర్మాత అమ్మ రాజశేఖర్‌, సంగీత దర్శకుడు గిరీష్‌ గోపాలకృష్ణన్‌ తదితరులు ప్రసంగించారు. 

Updated Date - 2022-08-15T16:27:33+05:30 IST