Vijay Antony: విజయ్ ఆంటోని దర్శకుడిగా ‘బిచ్చగాడు 2’

ABN , First Publish Date - 2021-07-24T18:12:58+05:30 IST

ఎన్నో చిత్రాలకు విజయవంతమైన సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోని నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. సంగీత దర్శకుడిగానే కాదు త‌న సినిమాల‌కు ఎడిట‌ర్‌గా సైతం వ్య‌వ‌హ‌రించే విజ‌య్ ఆంటోని తొలిసారి మెగాఫోన్ ప‌డుతున్నారు.

Vijay Antony: విజయ్ ఆంటోని దర్శకుడిగా ‘బిచ్చగాడు 2’

ఎన్నో చిత్రాలకు విజయవంతమైన సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోని నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. అయన హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమా తో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. సంగీత దర్శకుడిగానే కాదు త‌న సినిమాల‌కు ఎడిట‌ర్‌గా సైతం వ్య‌వ‌హ‌రించే విజ‌య్ ఆంటోని తొలిసారి మెగాఫోన్ ప‌డుతున్నారు. 


విజ‌య్ ఆంటోనికి హీరోగా బ్రేక్ తెచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా కి కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’  సినిమాలో హీరోగా నటించడమే కాకుండా విజయ్ ఆంటోని సినిమాను డైరెక్ట్ చేయనుండటం విశేషం.  త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు. శనివారం(జూలై24) విజయ్ ఆంటోని పుట్టిన రోజు సందర్భంగా  ఆయన్ని దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ ఈ చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. 

Updated Date - 2021-07-24T18:12:58+05:30 IST