విజయ్ ఆంటోనీ హీరోగా ‘హత్య’

ABN , First Publish Date - 2022-03-10T00:32:03+05:30 IST

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సైతం సొంతం చేసుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఆ సినిమా తర్వాత ఆయన చేసే ప్రతి చిత్రం తెలుగులో విడుదలవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా..

విజయ్ ఆంటోనీ హీరోగా ‘హత్య’

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సైతం సొంతం చేసుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఆ సినిమా తర్వాత ఆయన చేసే ప్రతి చిత్రం తెలుగులో విడుదలవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రానికి ‘హత్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రితికా సింగ్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించనుంది. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలాజీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు.


‘‘1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా ఈ ‘హత్య’ సినిమా సాగనుంది. అందమైన మోడల్ లీల తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు అనేది మిస్టరీగా మారుతుంది. డిటెక్టివ్, పోలీస్ కోణంలో ఈ కేసు ఛేదనలో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాధికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.’’ అని దర్శకనిర్మాతలు తెలిపారు.



Updated Date - 2022-03-10T00:32:03+05:30 IST