మరోసారి తెరపైకి ‘బిగిల్’ కాంబో ?

కోలీవుడ్ లో దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్ కు చెప్పలేని క్రేజ్. ఈ కలయికలో ఇంతకు ముందు వచ్చిన ‘తెరి, మెర్సల్, బిగిల్’  చిత్రాలు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాయి. ఈ మూడు సినిమాలూ తెలుగులోనూ విడుదలయ్యాయి. తమిళ్ వెర్షన్స్ అంత కాకపోయినా.. పర్వాలేదనిపించాయి. ఆ సినిమాలు తమిళనాట రికార్డు కలెక్షన్స్ రాబట్టాయి. అందుకే అభిమానులు మరోసారి విజయ్, అట్లీ కాంబినేషన్ ను కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే త్వరలోనే ఈ కాంబోలో నాలుగో సినిమా రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి. గత మూడు చిత్రాలకు మించే స్థాయిలో అదిరిపోయే ఓ యాక్షన్ కథాంశంతో సినిమా తెరకెక్కనుందట. 


ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో ఓ బాలీవుడ్ మూవీకి కమిట్ అయ్యాడు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యే టైమ్ కి విజయ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్లాన్ చేస్తున్నాడు అట్లీ. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు మూవీకి రెడీ అవుతారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తూనే .. తమిళంలో అట్లీ సినిమాను పట్టాలెక్కిస్తారట. మరి ఈ సారి అట్లీ విజయ్ కోసం ఎలాంటి కథాంశాన్ని రెడీ చేస్తారో చూడాలి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.