ఓటీటీ లో విడుదలవుతోన్న విద్యుత్ జమ్వల్ ‘సనక్’

ABN , First Publish Date - 2021-09-22T17:48:26+05:30 IST

బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సనక్’. విలక్షణ యువ నటుడు విద్యుత్ జమ్వల్ నటిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీని విపుల్ అమృతల్ షా, జీ స్డూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ‘హోప్ అండర్ సీజ్’ ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాకి కనిష్క్ వర్మ దర్శకుడు.

ఓటీటీ లో విడుదలవుతోన్న విద్యుత్ జమ్వల్ ‘సనక్’

బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సనక్’. విలక్షణ యువ నటుడు విద్యుత్ జమ్వల్ నటిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీని విపుల్ అమృతల్ షా, జీ స్డూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ‘హోప్ అండర్ సీజ్’ ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాకి కనిష్క్ వర్మ దర్శకుడు. బెంగాలీ భామ రుక్మిణి మైత్ర ఈ సినిమాతో బాలీవుడ్ లో కథానాయికగా పరిచయం కాబోతోంది. ఈ సినిమాను అతి త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఒక ఆకర్షణీయమైన పోస్టర్ ను వదిలారు మేకర్స్ . ఓ మెషీన్ గన్ తో విద్యుత్ .. రివీల్ అయిన లుక్  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఇంకా ఈ సినిమాలో  చందన్ రాయ్ సన్యల్, నేహాధూపియా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గతంలో విడుదలైన ‘సనక్’ ఫస్ట్ లుక్ పోస్టర్ బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. హిందీలో ‘సనక్’ అంటే క్రేజ్ అని అర్ధం. పేరుకు తగ్గట్టే ఈ సినిమా ఓ ఆసక్తికరమైన కథాంశంతో మాస్ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. గతంలో పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన విద్యుత్ కి ‘సనక్’ సినిమా ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. 

Updated Date - 2021-09-22T17:48:26+05:30 IST